యాదగిరీశుడి సేవలో హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు

యాదగిరీశుడి సేవలో హైకోర్టు జడ్జి శ్రీనివాసరావు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని అష్టోత్తర పూజలు చేశారు. మొదట ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ ఈవో భాస్కర్ రావు ఆధ్వర్యంలో అర్చకులు స్వాగతం పలికారు.

నారసింహుడి దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో అర్చక బృందం ఆయనకు వేదాశీర్వచనం చేయగా.. ఈవో లడ్డూ ప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. అనంతరం ఆలయ మాడవీధులను జడ్జి పరిశీలించారు. ఆయన వెంట ఆలేరు జడ్జి జస్టిస్ సుమలత ఉన్నారు.