
బషీర్‌బాగ్, వెలుగు: హైదరాబాద్ సిటీలో మ్యాన్ హోల్స్పొంగడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. మ్యాన్హోల్స్లీకేజీతో ప్రజల అసౌకర్యం అంశాన్ని సుమోటోగా తీసుకుంది. ఇటీవల నాంపల్లి ఎంఎన్ జే క్యాన్సర్ హాస్పిటల్ ముందు ఉన్న మ్యాన్ హోల్ నుంచి మురుగు పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారంటూ వార్త పత్రికల్లో వచ్చిన కథనాలపై హెచ్చార్సీ స్పందించింది.
సుమోటోగా కేసును స్వీకరించింది. మ్యాన్హోల్స్లీకేజీలపై విచారణ జరపాలని, జూన్ 4 లోగా నివేదిక సమర్పించాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డిని ఆదేశించారు.