నవంబర్ 16 నుంచి జూడో జాతీయ పోటీలు..

నవంబర్ 16 నుంచి జూడో జాతీయ పోటీలు..
  • ఎల్​బీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి
  • రాష్ట్ర జూడో చైర్మన్​ మెట్టు సాయికుమార్

ఓల్డ్​సిటీ, వెలుగు: జాతీయ జూడో చాంపియన్​షిప్​కు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర జూడో అసోసియేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్​ తెలిపారు. శుక్రవారం ఫిషిరీస్​ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్​బీ స్టేడియంలో ఈ నెల 16 నుంచి 20 వరకు జూడో జాతీయ సబ్​ జూనియర్​ చాంపియన్​షిప్​ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. 

39 రాష్ట్రాల నుంచి 750 మంది ప్లేయర్లు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. లాల్​ బహదూర్​ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కైలాశ్​ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎంఏ.అజీజ్​ ఫరూఖి, టెక్నికల్ చైర్మన్ రాము, అస్లాం, ముజాఫర్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.