పటాన్ చెరులో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్

పటాన్ చెరులో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్
  • వచ్చే నెల 16,17,18 తేదీల్లో నిర్వహణ  


పటాన్​చెరు,వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) క్రీడలను వచ్చే నెల 16, 17, 18 తేదీల్లో జరగనున్నాయి. బాలుర విభాగంలో వాలీబాల్ అండర్–-17, అండర్-–14 , బాలికల విభాగంలో కబడ్డీ అండర్–--17, అండర్--– 14 స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నారు. పటాన్​చెరు టౌన్ మైత్రి గ్రౌండ్ లో  పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 420 మంది క్రీడాకారులు, వందమంది పీఈటీలు పోటీల్లో పాల్గొంటారు. 

రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించగా పటాన్ చెరులో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం క్యాంపు ఆఫీసులో జిల్లా ఎస్జీఎఫ్ అధికారులు, పీఈటీలతో సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. మూడు రోజులు జరిగే పోటీల్లో పాల్గొనేవారికి భోజనం, వసతి, బహుమతులను సొంత నిధులు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రస్థాయి విజేత జట్లను జాతీయస్థాయి పోటీలకు కూడా సొంత నిధులతో పంపించనున్నట్లు పేర్కొన్నారు. పటాన్​చెరును రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.  ఈ సమావేశంలో సీనియర్ నేత దశరథ్ రెడ్డి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, గౌసుద్దీన్, పీఈటీలు పాల్గొన్నారు.