అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) స్టేట్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్, బెంగళూరు కేంద్రంగా ఉన్న గ్రో అసెట్ మేనేజ్‌మెంట్‌లో 23శాతం వాటాను రూ.580 కోట్ల (65 మిలియన్ డాలర్ల)కు కొనుగోలు చేయనుంది. కాగా, బ్రోకరేజ్ కంపెనీ గ్రో పేరెంట్ కంపెనీ బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్. ఈ పేరెంట్ కంపెనీకి సబ్సిడరీ గ్రో ఏఎంసీ. స్టేట్ స్ట్రీట్ ఈ పెట్టుబడిని వివిధ దశల్లో పెట్టనుంది. రూ.381 కోట్లను సెకండరీ షేర్ కొనుగోలు ద్వారా, మిగిలిన రూ.199 కోట్లను ఫ్రెష్ క్యాపిటల్ కింద ఇన్వెస్ట్ చేయనుంది.
ఫ్రెష్ క్యాపిటల్‌తో గ్రో ఏఎంసీలో 23 శాతం వరకు వాటా డైల్యూట్ అవుతుంది(ఇతర షేర్ హోల్డర్ల వాటా తగ్గుతుంది). ఈ పెట్టుబడి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు తీర్చడంలో, భవిష్యత్ వృద్ధి అవకాశాలను సాధించడంలో సహాయపడుతుంది. లావాదేవీ పూర్తయిన తర్వాత స్టేట్ స్ట్రీట్ ఓటింగ్ పవర్ 4.99శాతం కంటే ఎక్కువగా ఉండదు. “ప్రపంచంలో అతిపెద్ద ఏఎంసీ సంస్థల్లో ఒకటైన స్టేట్ స్ట్రీట్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా స్వాగతించడం ఆనందంగా ఉంది” అని గ్రో ఫౌండర్ హర్ష్ జైన్ అన్నారు.
