మైగ్రెంట్ లేబర్స్ బాధ్యత రాష్ట్రాలదే

మైగ్రెంట్ లేబర్స్ బాధ్యత రాష్ట్రాలదే
  • స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా మైగ్రెంట్ లేబర్స్ కష్టాలు, సొంతూరు వెళ్లేందుకు వారు పడుతున్న నరక యాతనపై తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతోంది. వారిని పట్టించుకోవటం లేదని కేంద్రంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మైగ్రెంట్ లేబర్స్ అంశంపై స్పష్టత ఇచ్చింది. ఎక్కడైతే మైగ్రెంట్ లేబర్స్ ఉన్నారో వారి బాధ్యతను ఆయా రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం సూచించింది. వారి సంక్షేమానికి మానవతాధృక్పథంతో వ్యవహారించాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పష్టం చేశారు. చాలా మంది కాలినడక సొంతూర్లకు వెళ్తున్నారని అలాంటి వారిని రోడ్లపై రైల్వే ట్రాక్ పై నడవకుండా చర్యలు తీసుకోవాలని…వారికి ఫుడ్, షెల్టర్ అందిచాలని కోరుతూ అన్ని రాష్ట్రాలకు లెటర్ రాసింది. మైగ్రెంట్ లేబర్స్ కోసం రైల్వే శ్రామిక్ ట్రైన్స్ నడుపుతోందని రోడ్లపై, రైల్వే ట్రాక్ లపై నడిచే వారిని గుర్తించి శ్రామిక్ రైళ్లలో వారిని తరలించేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని కోరింది. వలస కార్మికుల ను సొంతూళ్లకు తరలించే ప్రక్రియను పర్యవేక్షించటం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఏం చేసిన కేంద్రమే చేయాలని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ బాధ్యత రాష్ట్రాలదేనని చెప్పింది.