హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడులన్నింటిలో ఈ నెల 21న పేరెంట్ టీచర్ మీటింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. గవర్నమెంట్, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఈ మీటింగ్ పెట్టాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు మంగళవారం డీఈఓలకు ఆదేశాలిచ్చారు. పరీక్షల టైం దగ్గర పడుతుండటంతో పిల్లలకు ఇంట్లో ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనే దానిపై పేరెంట్స్ లో అవగాహన కల్పించాలని సూచించారు. మీటింగ్‌కు రాని పేరెంట్స్ ను గుర్తించి, మళ్లీ రప్పించాలన్నారు.
