రాష్ట్రావ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

 రాష్ట్రావ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

మంచిర్యాల/కాగజ్ నగర్/భైంసా/ఆదిలాబాద్​టౌన్/కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్రావ్యాప్తంగా జరిగిన ట్రాన్స్​ఫర్లలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్​గా ఉన్న కె.సంపత్ కుమార్ వేములవాడకు బదిలీ కాగా, అక్కడ పనిచేస్తున్న జి.అన్వేశ్ ​మంచిర్యాల కమిషనర్​గా నియమితులయ్యారు. బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్​ను ములుగు కమిషనర్​గా బదిలీ చేసి ములుగులో పనిచేస్తున్న జె.సంపత్​ను ఇక్కడ నియమించారు. 

రామగుండం మున్సిపల్ కమిషనర్ కార్పొరేషన్​లో పనిచేస్తున్న ఈ మారుతి ప్రసాద్​ను క్యాతనపల్లి కమిషనర్​గా పోస్టింగ్ ఇచ్చి, ఇక్కడ పనిచేస్తున్న జి.రాజును ఆదిలాబాద్ కమిషనర్​గా ట్రాన్స్​ఫర్ చేశారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్​గా బట్టు తిరుపతి నియమితులయ్యారు. కోరుట్ల మున్సిపల్ కమిషనర్​గా పని చేస్తున్న తిరుపతిని ఇక్కడికి బదిలీ చేశారు. నిర్మల్ ​జిల్లా భైంసా మున్సిపల్ కమిషనర్​గా ఖాజా మొహినోద్దీన్​నియమితులయ్యారు.