Ashes 2025-26: నెక్స్ట్ లెవల్ ఎలివేషన్: ప్రతిష్టాత్మక టోర్నీకి గ్రాండ్ వెల్కమ్.. హెలికాఫ్టర్‌లో సిడ్నీకి యాషెస్ ట్రోఫీ

Ashes 2025-26: నెక్స్ట్ లెవల్ ఎలివేషన్: ప్రతిష్టాత్మక టోర్నీకి గ్రాండ్ వెల్కమ్.. హెలికాఫ్టర్‌లో సిడ్నీకి యాషెస్ ట్రోఫీ

క్రికెట్ లో ప్రస్తుతం యాషెస్ ఫీవర్ నడుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ఈ మెగా టోర్నీ నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 21 నుంచి స్టార్ట్ కానుంది. సొంతగడ్డ కావడంతో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఈ మెగా సిరీస్ కు 16 రోజుల సమయం మాత్రమే ఉంది. సొంతగడ్డపై జరగబోయే ఈ టెస్ట్ సిరీస్ ను ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు 2015 నుంచి యాషెస్ గెలవని ఇంగ్లాండ్ ఎలాగైనా ఆసీస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది.

యాషెస్ ట్రోఫీ ఎంట్రీనే ఓ రేంజ్ లో జరిగింది. సిడ్నీలో ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీ హెలికాఫ్టర్ లో ద్వారా తీసుకొని వచ్చారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఐకానిక్ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా చేతుల మీదుగా యాషెస్ ట్రోఫీ ఆవిష్కరించబడింది. ట్రోఫీ హెలికాఫ్టర్ లో రావడంతో సిరీస్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనాకు వచ్చేశారు. ఇప్పటికే ఇరు దేశాలు తమ స్క్వాడ్ లను ప్రకటించేశాయి. ఆస్ట్రేలియా క్రికెటర్లు యాషెస్ ప్రాక్టీస్ లో భాగంగా నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. త్వరలోనే ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియా చేరుకోనుంది.    

క్రికెట్ లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ కు స్పెషల్ క్రేజ్ ఉంది. క్రికెట్ లో తొలి మ్యాచ్ నుంచి వీరి మధ్య సమరం ఇప్పటికీ ఓ రేంజ్ లో కొనసాగుతోంది. నవంబర్ 21 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాలో జరగనుంది. 1882లో తొలిసారి యాషెస్ సిరీస్‌ జరిగింది. ప్రతి రెండేళ్లకోసారి ఈ ప్రతిష్టాత్మక సిరీస్ వచ్చినప్పుడల్లా క్రికెట్‌ ప్రపంచంలో చర్చ జరుగుతూనే ఉంటుంది.

చివరిసారిగా ఇంగ్లాండ్ లో జరిగిన యాషెస్ 2-2 తో సమమైంది. తొలి రెండు టెస్టులు ఆస్ట్రేలియా గెలిస్తే చివరి మూడు టెస్టుల్లో ఇంగ్లాండ్ రెండు టెస్టులు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. అంతకముందు 2021-22 యాషెస్ లో ఆస్ట్రేలియా 4-0తో గెలిచింది. ఆస్ట్రేలియా చివరి 15 స్వదేశీ టెస్టుల్లో రెండింటిలో మాత్రమే ఓడిపోయింది. ఓవరాల్ గా ఇప్పటి వరకూ చరిత్రలో మొత్తం 330 యాషెస్‌ టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 136 టెస్టులు, ఇంగ్లండ్‌ 108 టెస్టులు గెలవగా.. 91 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇటీవలే ఇండియాతో ఇంగ్లాండ్ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా వెస్టిండీస్ పై 3-0 తేడాతో గెలిచింది.