నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 382.91 పాయింట్ల నష్టంతో 57,300.68 వద్ద ముగిసింది. నిఫ్టీ 114.45 పాయింట్లు నష్టపోయి 17,092.20 వద్ద స్థిరపడగా..  డాలర్తో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద నిలిచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.02 శాతం పతనమైంది. స్మాల్ క్యాప్ షేర్లు 2.05 శాతం క్షీణించాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్ సూచీలపై ప్రభావం పడుతోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాల్లోకి సైన్యాన్ని పంపాలని ఆదేశించడంతో మార్కెట్లపై ఒత్తిడి పెరిగిందని క్యాపిటల్వియా గ్లోబల్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ అన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని మొత్తం 15 సెక్టార్ స్టాక్‌లు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ, నిఫ్టీ మెటల్ వరుసగా 1.48 శాతం, 1.11 శాతం తగ్గడం ద్వారా ఇండెక్స్‌ను బలహీనపరిచాయి. టాటా స్టీల్ 4.05 శాతం తగ్గింది. బీపీసీఎల్, టీసీఎస్, ఎస్‌బీఐ లైఫ్, టాటా మోటార్స్ కూడా నష్టపోయాయి.

మరిన్ని వార్తల కోసం:

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’

టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా అగార్కర్‌?

తెలంగాణ సమాజం నిన్ను చూసి నవ్వుతోంది కేసీఆర్