మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’

మధ్యప్రదేశ్లో ‘తెలుగు వెలుగు’

ఇండోర్: ప్రపంచ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు తెలుగును బోధించాలని నిర్ణయించింది. దీంతో ఆ రాష్ట్రంలోని​ స్కూళ్లలో ఇకపై ‘అ, ఆ, ఇ, ఈ’లు వినిపించనున్నాయి. తేనెలొలికే తెలుగు పదాలు అక్కడి విద్యార్థుల నోటి వెంట రానున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకున్న నిర్ణయంతో.. రాష్ట్రంలోని స్కూళ్లలో త్వరలో తెలుగు భాష‌ను బోధించనున్నారు. ప్రయోగాత్మకంగా ఇతర రాష్ట్రాల భాషలనూ విద్యార్థులకు బోధించనున్నట్లు మధ్యప్రదేశ్ విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ తెలిపారు. తెలుగుతో పాటు మరాఠీ, పంజాబీ భాషలనూ విద్యార్థులకు నేర్పనున్నట్లు చెప్పారు. 52 జిల్లాల్లోని ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో తెలుగు, పంజాబీ, మరాఠీని బోధిస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

శ్రీవారి దర్శనం టోకెన్ల సంఖ్య పెంపు

భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై RGV సంచలన ట్వీట్‌

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు