భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై RGV సంచలన ట్వీట్‌

భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై RGV సంచలన ట్వీట్‌

ఆర్జీవి వింతజీవి ఎవ్వరికీ అర్థం కాడు. ఎపుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం.మనసులో ఏది ఉందో దాన్ని నిర్మోహమాటంగా మాట్లాడటం..అనుకున్నది  చేసేయడం ఆర్జీవి మార్క్ స్టైల్.అదేంటో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ టార్గెట్‌గా తనదైన కోణంలో విమర్శనాత్మక బాణాలు సంధిస్తున్నారు గోపాల్ వర్మ. తాజాగా భీమ్లానాయక్ ట్రైలర్‌పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాను భీమ్లా నాయక్ అని కాకుండా డానియల్ శేఖర్ అని పిలవాలని అనిపిస్తోందని వర్మ అభిప్రాయపడ్డాడు.హీరో రానాను ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్‌ని వాడేసుకున్నారని తెలుస్తోందంటూ మంట పెట్టే కామెంట్ చేశారు.ఈ ట్రైలర్‌ లో పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడా కనిపించలేదని చిత్ర బృందానికి చురకలు అంటించారు. మొత్తం రానాకే హైప్‌ ఇచ్చారని.. పవన్‌ ఫ్యాన్‌ గా తాను చాలా హర్ట్‌ అయ్యానంటూ తెలిపారు.ప్రస్తుతం వర్మ చేసిన ఆ ట్వీట్‌ వైరల్‌ గా మారింది.దీంతో ఆర్జీవీపై పవన్ ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం

ఆపద్బాంధవుడు హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూడండి..!

శకుంతల పాత్రలో సమంత