శకుంతల పాత్రలో సమంత

శకుంతల పాత్రలో సమంత

యూటర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన టాలెంట్‌‌‌‌ ఏంటో చూపించిన సమంత.. మొదటిసారి ఓ పౌరాణిక పాత్రలో కనిపించబోతోంది. గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలమ్‌‌‌‌’లో  శకుంతల పాత్ర పోషిస్తోంది. నిన్న ఆమె ఫస్ట్ లుక్‌‌‌‌ రిలీజయ్యింది. అది చూస్తే ఈ ప్రేమకథని ఓ దృశ్యకావ్యంలా మలుస్తున్నానని గుణశేఖర్ చెప్పిన మాట ముమ్మాటికీ నిజమేననిపిస్తోంది. పచ్చని వనంలో ఓ రాయిమీద కూర్చున్న సమంత.. తెల్లని దుస్తుల్లో పాలరాతి శిల్పంలా మెరుస్తోంది. ఎర్రని పూలనే ఆభరణాలుగా మార్చి చేసిన అలంకరణ ఆమెకి మరింత అందాన్ని తెచ్చింది. చుట్టూ జింకలు, నెమళ్లు, కుందేళ్లు, హంసలు, సీతాకోక చిలుకలు, రకరకాల పక్షులు ఉన్నాయి. అవన్నీ ఎవరీ సౌందర్యరాశి అన్నట్టుగా తలెత్తి ఆమెవైపే చూస్తున్నాయి. కానీ సమంత మాత్రం వీటిలో దేనినీ చూడటం లేదు. ఆమె కళ్లు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. దుష్యంతుడి కోసమే అనుకుంటా.. దారి కాచుకుని ఉన్నాయి. మొత్తంగా ఈ దృశ్యం.. ఒక అందమైన పెయింటింగ్‌‌‌‌లా ఉంది. చూడగానే వావ్ అనిపిస్తోంది. దుష్యంతుడి పాత్రను దేవ్ మోహన్ పోషిస్తున్నాడు. వారి కొడుకు భరతుడిగా అల్లు అర్జున్ కూతురు ‘అర్హ’ నటిస్తోంది. దిల్ రాజు సమర్పణలో నీలిమా గుణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.