ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

ప్రజల కష్టార్జితాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెడుతుండు

హైదరాబాద్: బంగారు తెలంగాణ తరహాలో బంగారు భారత్ ను నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజల కష్టార్జితాన్ని కేసీఆర్ తన కుటుంబానికి, కొందరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు. కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక ముఖ్యమంత్రి అని.. ప్రశ్నించిన గొంతులు నొక్కి.. మళ్లీ ఇప్పుడు బంగారు భారత్ నినాదం ఇస్తున్నారని విమర్శించారు. ప్రజలు తమ ఇళ్ల తలుపులకు గొళ్లాలు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలని ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. సేవ్ తెలంగాణ అనే హ్యాష్ ట్యాగ్ ను ఈ ట్వీట్ కు జత చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై RGV సంచలన ట్వీట్‌

TRSతో కలిసి పనిచేయాల్సిన అవకాశం ఊహాజనీతమే

నాలుగో వన్డేలోనూ భారత్ కు తప్పని ఓటమి