TRSతో కలిసి పనిచేయాల్సిన అవకాశం ఊహాజనీతమే

TRSతో కలిసి పనిచేయాల్సిన అవకాశం ఊహాజనీతమే

కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను బీజేపీ అమ్ముతోందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్. మత పరమైన అంశాలను లెవనెత్తి ఓట్లు దండుకునేందుకు బీజేపీ యత్నిస్తుందన్నారు. దేశ సౌరభౌమత్వాన్ని విచ్ఛిన్నం చేసి విభజన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందన్నారు. తెలంగాణా సెంటిమెంట్ ని అగౌరపరిచే ప్రధానమంత్రిని రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నిలదీయడం లేద‌న్నారు. కాంగ్రెసేత‌ర‌ కూటమి సాధ్యం కాదని కాంగ్రెసేత‌ర పార్టీలే చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటు చేయడం అసంభవమ‌న్నారు పొన్నాం. సంకీర్ణాలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు.TRSతో కలిసి పనిచేయాల్సిన అవకాశం ఊహాజనీతమే అన్నారు. 

మూతబడే స్థితిలో ఉన్న బీజేపీని కేసీఆర్ జీవం పోస్తున్నాడన్నాడు. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లును సమర్ధించిన టీఆర్ఎస్ , ఇప్పుడు వ్యతిరేక గళం ఎందుకు వినిపిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర నిఘా సంస్థలను ప్రతిపక్షాల మీద ఉపయోగించే బీజేపీ తెలంగాణాలో మౌనం ఎందుకన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ , బీజేపీలు యత్నిస్తున్నాయన్నారు. బీజేపీ , టీఆర్ఎస్ ల వ్యవహారం మ్యాచ్ ఫిక్సింగ్ లా కనిపిస్తుందన్నారు. 105 సీట్లలో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ తెలంగాణాలో ప్రత్యామ్నాయం ఎలా అవుతుందన్నారు. తెలంగాణా కోసం బీజేపీ నేతలు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు పొన్నాం ప్ర‌భాక‌ర్. 

ఇవి కూడా చ‌దవండిః

ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని మోడీ

భీమ్లా నాయక్‌ ట్రైలర్‌పై RGV సంచలన ట్వీట్‌