లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17723 స్థాయిని తాకిన నిఫ్టి ఇప్పుడు 17694 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి రోజున ముగింపుతో పోలిస్తే నిఫ్టి 117 పాయింట్లు లాభపడింది. అలాగే నిఫ్టితో పాటు ఇతర అన్ని సూచీలు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. బడ్జెట్లో మౌళికరంగ వ్యవయాలను భారీగా పెంచడం.. కొత్త పన్నులు విధించకపోవడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని కలిగించినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం  నిఫ్టి 0.67 శాతం లాభంతో ట్రేడువుతుండగా, బ్యాంక్‌ నిఫ్టి 1.25 శాతం లాభంతో ట్రేడవుతోంది. బాంబే స్టాక్ ఎక్ఛేంజ్ సూచీ 59వేల మార్కును దాటింది.  నిఫ్టిలో 41 షేర్లు లాభాల్లో ఉండగా, 9 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆటో షేర్లలో ఐషర్‌ మోటార్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. చోళమండలం ఫైనాన్స్‌ షేర్‌ 4 శాతంపైగా క్షీణించగా, అశోక్‌ లేల్యాండ్‌ 3 శాతంపైగా లాభపడింది. ఇక మిడ్‌ క్యాప్‌ బ్యాంకింగ్‌ షేర్లలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 2శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.