
మహారాష్ట్రలోని హింగోలిలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. చికెన్ షాప్‌లో జరిగిన గొడవ రెండు గ్యాంగ్‌లుగా మారి రాళ్లు విసురు కునే దాకా మారింది. శుక్రవారం రాత్రి 10గంటలకు రెండు వర్గాలగా ఏర్పడి పెద్ద ఎత్తున ఘర్ణనలకు దిగారు. కర్రలతో కొట్టుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఇంత పెద్ద గొడవకు కారణం షాప్‌లో చికెట్ కోలుగోలు చేసేటప్పుడు మాటామాట పెగిరి జరిగిన చిన్న వివాదం... ఆ కాలనీ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో 8మందిపై కేసు నమోదు చేశారు. మళ్లీ గొడవ చెలరేగే అవకాశం ఉందని పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు కూడా.