పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆపండి: ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం

పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు ఆపండి: ఏపీకి కృష్ణా బోర్డు ఆదేశం

కృష్ణా బోర్డు ఏపీని ఆదేశించడం మూడోసారి

ఇప్పటికే రెండుసార్లు లైట్ తీసుకున్న ఆంధ్రా సర్కారు

అనుమతులు లేకుండానే టెండర్ల ప్రాసెస్ స్పీడప్

వీ6వెలుగువరుస కథనాలతో తెలంగాణ సర్కారులో కదలిక

హైదరాబాద్, వెలుగు: ఏపీ సర్కారు తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్ స్కీంలను ఆపాలంటూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సర్కారు కు వరుసగా మూడో సారి ఆ దేశాలు జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు బోర్డు ఇచ్చిన ఆదేశాలను లైట్ తీసుకున్న ఏపీ సర్కారు .. ఏకంగా ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియనూ వేగవంతం చేసింది. మరో 20 రోజుల్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి పనులు మొదలు పెట్టాలన్న పట్టుదలతో ముందుకువెళ్తోంది. ఇలా దూకుడుగా వెళ్తున్న ఏపీ సర్కారు మూడోసారి ఇచ్చిన ఆదేశాలతో ఏ మేరకు కట్టడి అవుతుందన్న చర్చ మొదలైంది.

సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్​ స్కీంకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందే వరకూ ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లొద్దని ఏపీ సర్కారును కృష్ణా బోర్డు ఆదేశించింది. బోర్డు, సీడబ్ల్ యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందే వరకూ పనులపై ముందుకెళ్లొద్దని గతంలోనే ఆదేశించామని గుర్తు చేసింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ను అతిక్రమించి నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కౌన్సిల్ ఆమోదం తప్పనిసరని స్పష్టం చేసింది. తమ ఆదేశాలను అతిక్రమిం చి ఏపీ సర్కారు టెండర్ల ప్రక్రియ చేపట్టిందని తప్పుపట్టింది.

ఇది మూడోసారి

పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంలను ఆపాలంటూ కృష్ణా బోర్డు ఏపీ సర్కారును ఆదేశించడం ఇది మూడోసారి. జూన్ 4న నిర్వహించిన కృష్ణా బోర్డు 12వ మీటింగ్ లో మొదటిసారి ఆదేశాలు ఇచ్చింది. జూలై ఒకటిన ఏపీ సర్కారుకు మరోసారి లెటర్ రాసింది. కానీ బోర్డు ఆదేశాలను ఏపీ లైట్ తీసుకుంది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్ లు ఇవ్వాలంటూ ఆదేశించినా పట్టిం చుకోలేదు. పోతిరెడ్డిపాడు కెపాసిటీని పెంచడంతో పాటు సంగమేశ్వరం లిఫ్టు డీపీఆర్ లు ఇవ్వాలని బోర్డు గతంలో ఏపీని కోరింది. అయితే బదులుగా లెటర్ రాసిన ఏపీ.. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ప్రస్తావ కూడా లేకుండానే మిగతా ప్రాజెక్టుల విషయాలతో సరిపెట్టింది. కొత్త ప్రాజెక్టులపై టెండర్ల వరకు వెళ్లినా ఆ పేపర్లను కూడా బోర్డుకు అందించేందుకు ముందుకు రాలేదు. కృష్ణా బోర్డుకు నిర్దిష్ట అధికార పరిధి (జ్యూరిస్డిక్షన్ ) లేకపోవడంతోనే ఏపీ లైట్ తీసుకుంటోందన్న అభిప్రాయం ఉంది.

దక్షిణ తెలంగాణ ఎడారే..

ఏపీ సర్కారు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరే ప్రతి నీటి చుక్కను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మళ్లించుకునేలా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులే టర్ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంలను ప్రతిపాదించింది. నిరుడు డిసెంబర్ లోనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై విధాన పరమైన నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం జగన్ ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయం వెల్లడించారు. అప్పటి నుంచి ఏపీ కొత్త ప్రాజెక్టులపై ఎలా ముందుకు వెళ్తోందో చెప్తూ  ‘వీ6 వెలుగు’ కథనాలు ప్రచురిస్తూ వచ్చింది. వెలుగులో పబ్లిష్ అయిన స్టోరీల ఆధారంగానే తెలంగాణ ఈఎన్సీ ఫిబ్రవరిలో కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.

తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచడం, సంగమేశ్వరం వద్ద రోజుకు 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకునేలా లిఫ్ట్ స్కీంకు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తూ ఏపీ మే ఐదో తేదీన 203 జీవో జారీ చేసిది. ఇలా ఏపీ ప్రయత్నాలను అందరికీ తెలిసేలా ‘వీ6 వెలుగు’ ప్రత్యే క కథనాలు ప్రచురించింది. పోతిరెడ్డిపాడు గండిని డబుల్ చేయడంతోపాటు సంగమేశ్వరం లిఫ్ట్ కూడా చేపడితే శ్రీశైలం ప్రాజెక్టునే ఏపీ కబ్జా పెడుతుందని హెచ్చరించింది. ఈ కథనాలతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తు న ఆందోళనలు చేపట్టడంతో మే 11న సీఎం కేసీ ఆర్ ఏపీ ప్రాజెక్టులపై సమీక్షించారు. వాటిని అడ్డుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టులో కేసు వేసి ఏపీ ప్రాజెక్టులను ఆపుతామన్నారు. సీఎం ఆదేశాలతో ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కృష్ణా బోర్డు చైర్మన్ ను కలిసి కంప్లైంట్ చేశారు. దానికి ప్రతిగా ఏపీ ఏకంగా కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణ నిర్మిస్తు న్న అన్ని ప్రాజెక్టులపైనా కంప్లైంట్లు చేసింది.

రైతు పోరాటంతో ఎన్జీటీ స్టే

ఏపీ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామంటూ ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆ దిశగా కనీస ప్రయత్నాలు కూడా చేయలేదు. దాంతో రైతులే రంగంలోకి దిగారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెం దిన గవినోళ్ల శ్రీనివాస్ అనే రైతు ఎన్జీటీలో పిటిషన్ వేయడంతో.. ఏపీ కొత్త ప్రాజెక్టులపై గ్రీన్ ట్రిబ్యు నల్ స్టే ఇచ్చింది. వాటి పనులకు రెండు నెలల పాటు బ్రేక్ పడింది. అయితే ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియకు ఎన్జీటీ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీ సర్కారు ఈనెల 15న టెం డర్ల ప్రాసెస్ మొదలు పెట్టింది.

సంగమేశ్వరం లిఫ్ట్ తో పాటు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ నాలుగో కిలోమీటర్ వరకు అప్రోచ్ చానల్ పనులకు టెండర్లు పిలిచింది. అయినా తెలంగాణ సర్కారు నుంచి స్పందన లేదు. ఈ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ ‘వీ6 వెలుగు’ కథనాలు ప్రచురించింది. ఏపీ ఏవిధంగా ముందుకు వెలుతోందో వివరించింది. రాయలసీమ లిఫ్ట్ స్కీంకు ఎలాంటి అనుమతులు లేకున్నా .. అక్రమంగా పర్మిషన్లు పొందేందుకు నాలుగు నెలల కింద నీతి ఆయోగ్ కు లెటర్ రాసిందన్న విషయాన్ని బయటపెట్టింది. ఈ కథనాలతో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, రైతులు ఆందోళనలు చేపట్టారు. సర్కారు అనివార్యంగా స్పందించి.. ఏపీని నిలువరించాలంటూ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది.

వరుస కథనాలతో..

ఏపీ సర్కారు శ్రీశైలం ప్రాజెక్టునే కబ్జా పెట్టేలా చేపట్టిన ఈ ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణకు జరిగే నష్టాన్ని మొదటి నుంచి ‘వీ6 వెలుగు’ వరుస కథనాలతో చాటి చెప్తూ వచ్చింది. అక్రమ ప్రాజెక్టుల విషయంలో ఏపీ సర్కారు చర్యలను ఎప్పటి కప్పుడు ప్రజల ముందు ఉంచింది. అక్రమ ప్రాజెక్టును సక్రమం చేసుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రయత్నాలను.. ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని బయటపెట్టింది. ‘వీ6 వెలుగు’ వరుస కథనాలతో సర్కారుపై ఒత్తిడి పెరిగి.. ఈనెల 25న కృష్ణా బోర్డు కు ఇరిగేషన్ ఈఎన్సీ కంప్లైంట్ చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన బోర్డు మెంబర్ సెక్రెటరీ హరికేశ్ మీనా గురువారం ఏపీ వాటర్ రీసోర్సెస్ స్పెషల్ సీఎస్ కు లెటర్ రాశారు. అయితే తమ ఫిర్యాదుతోనే మొదటిసారిగా కృష్ణా బోర్డు స్పందించిందన్న తీరుగా సీఎం ఆఫీసు ప్రెస్ నోట్ విడుదల చేసింది.