కుక్కలు, కోతుల బెడదను అరికట్టండి : సూర్యనారాయణ

కుక్కలు, కోతుల బెడదను అరికట్టండి : సూర్యనారాయణ

హైదరాబాద్, వెలుగు: అర్బన్ ఏరియాల్లో కుక్కలు, కోతుల బెడదను అరికట్టాలని బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. సోమవారం ఆయన అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడారు. "కేంద్రం నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫండ్స్ రిలీజ్ చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో నిధుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, హెల్త్ కార్డులివ్వాలి.  కేంద్ర ప్రభుత్వం ట్రిబుల్ ఆర్ కోసం 26 వేల కోట్లు కేటాయించింది. వాటితో పనులు వేగంగా పూర్తి చేయాలి. నిజాంషుగర్ ఫ్యాక్టరీని తెరిచేందుకు కావాల్సిన నిధులను బడ్జెట్​లో కేటాయించాలి. నిజామాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలి" అని సూర్యనారాయణ  డిమాండ్ చేశారు. 

భూములను అమ్మి డెవలప్ మరిచారు: మల్ రెడ్డి రంగారెడ్డి 

గత పాలకులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని భూములను అమ్ముకున్నారు కానీ, డెవలప్ చేయలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీలు కూడా లేవని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు.  హైదరాబాద్, రంగారెడ్డిలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ సర్కారు తెచ్చిందని చెప్పారు.