పేషంట్ కి ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్ కి స్ట్రోక్

V6 Velugu Posted on Nov 28, 2021

కామారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషంట్ కు ట్రీట్మెంట్ చేస్తుండగా.. డాక్టర్ కు స్ట్రోక్ వచ్చింది. దాంతో ఇద్దరూ మృతిచెందారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఒకరికి ఆదివారం ఉదయం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాంతో ఆ వ్యక్తిని గాంధారిలోని డా.లక్ష్మణ్ కు చెందిన నర్సింగ్ హోమ్ కు తరలించారు. అక్కడ పేషంట్ కు చికిత్స చేస్తుండగా.. డాక్టర్ కు కూడా స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. పేషంట్ ను కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.

Tagged Kamareddy, heart attack, Heart Stroke, gandhari mondal, heart patient

Latest Videos

Subscribe Now

More News