విద్యార్థి అయ్యప్ప మాల: క్లాస్ నుండి సస్పెండ్

విద్యార్థి అయ్యప్ప మాల: క్లాస్ నుండి సస్పెండ్

మెదక్ జిల్లా: అయ్యప్ప మాల వేసుకున్నాడని విద్యార్థిని క్లాస్ నుండి 40 రోజులు సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. నర్సాపూర్ లో డాన్ బొస్కో హై ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రసాద్ అనే బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. రెండ్రోజుల ముందు అయ్యప్ప మాల వేసుకున్న ప్రసాద్ ను దీక్ష ముగిసేంత వరకు స్కూల్ కు రావద్దని హెడ్ మాస్టర్ తెలిపాడు.

ఈ విషయం తెలిసిన అయ్యప్ప స్వాములు స్కూల్ ముందు ధర్నాకు దిగారు. తక్షణమే ప్రసాద్ ను క్లాస్ రూమ్ లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.