
మెదక్(వెల్దుర్తి), వెలుగు: కారు ప్రమాదంలో స్టూడెంట్ మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం మెదక్ జిల్లాలో జరిగింది. వెల్దుర్తి మండలం, మంగళపర్తి, వెల్దుర్తి గ్రామానికి చెందిన శ్రీనికేతగౌడ్, రాఘవేందర్, కె.పితనీష్, పి.వికాస్,కె .ప్రభాస్ గౌడ్ కారులో నర్సాపూర్ కు వెళ్లారు. తిరిగి వస్తుండగా.. మంగల్ పర్తి గ్రామ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి కారు బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న శ్రీ నికేతన్ గౌడ్(19) మృతి చెందగా, తనీష్ , వికాస్ లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డవారిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.