ఫోన్ వాడొద్దన్నందుకు.. ఉరి వేసుకుంది

ఫోన్ వాడొద్దన్నందుకు.. ఉరి వేసుకుంది

గన్నేరువరం, వెలుగు: సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు 8వ క్లాస్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ కు చెందిన కొరివి లక్ష్మయ్య జ్యోతి దంపతుల పెద్ద బిడ్డ హన్సిక(15) కొద్ది రోజుల నుంచి మొబైల్ ఫోన్ తో ఎక్కువ టైం గడుపుతోందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన హన్సిక శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో చీరతో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

For More News..

టీఆర్ఎస్‌లో రెబల్స్ లొల్లి

ఎన్నికల సామాన్లకు ఫుల్ గిరాకీ

వరద సాయం కాదది.. ఓటుకు నోటు