
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న ఈ వీడియోని చూస్తే టీన్ ఏజ్ కుర్రోళ్లైతే ఇలాంటి టీచర్ మాకెందుకు లేదని అనుకుంటారు. అదే పెద్దవాళ్లు అయితే పిచ్చి బాగా ముదిరింది అనుకుంటారు. స్కూల్ ఫేర్ వెల్ పార్టీలో టీచర్ ఓ స్టూడెంట్ తో రొమాంటిక్ సాంగ్ కు డ్యాన్స్ వేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 14 మిలియన్లకు పైగా వ్యూస్, 9లక్షల షేర్లు, 11వేలకు పైగా కాంమెట్లు ఈ వీడియోకి వచ్చాయి. క్లాస్ రూంలోనే ఆషికి 2 మూవీలోని తుమ్ హి హో పాటకు ఓ లేడీ టీచర్ విద్యార్థితో స్టెప్పులు వేసింది. స్టూడెంట్, టీచర్ రొమాంటిక్ డ్యాన్స్ తెగ వైరల్ అవుతుంది
దీన్ని చూసిన వారు కొందరు అందులో తప్పేంముంది అని సమర్థిస్తున్నారు. మరికొందరు ఇలాంటి పనులు మంచివి కావు అని ఫైర్ అవుతున్నారు. ఇంకొందరు ఇలా టీచర్ తో డ్యాన్స్ వేసే అదృష్టం కొంతమందికే వస్తుంది. ఇది చాలామంది కల అని కాంమెంట్ చేస్తున్నారు. ఏదేమైనా వీడియోని మాత్రం ఫుల్ వైరల్ అవుతుంది. తనిషా ఇస్లాం ఇస్టా అకౌంట్ లో ఇది పోస్ట్ అయింది.