
చెన్నూర్ లో విద్యార్థి నిరుద్యోగుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొంటే తెలంగాణ వచ్చిన తరువాత నిరుద్యోగులను కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని వివేక్ వెంకటస్వామి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారన్నారు. చెన్నూరులో బాల్క సుమన్ ఓడించేందుకు నిరుద్యోగులు నిర్ణయం తీసున్నారన్నారు. బాల్క సుమన్ గుండా రాజకీయం చేస్తున్నాడని, నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాల్క సుమన్ లాంటి ఎమ్మెల్యేలే కారణమని నిరుద్యోగులు తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో రౌడీ రాజకీయాన్ని అంతమొందించాలని విద్యార్థి లోకం పిలుపునిస్తోందని.. . విద్యార్థులు తలచుకుంటే ఎలాంటి నాయకుడుకైనా గెలుపోటములు నల్లేరు మీద నడకే అని అనటంలో ఎలాంటి సందేహం లేదని చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో NSUI నేత బలమూరు వెంకట్, మహిపాల్ యాదవ్, హై కోర్టు అడ్వకేట్ శరత్ పాల్గొన్నారు.