
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలుగు రాష్ట్రాల్లో మహిళలు హర్షం వ్యక్తం చేశారు. దిశ కేసులో న్యాయం జరిగిందంటూ గుంటూరులో మహిళలు, విద్యార్థినులు సంబురాలు చేసుకున్నారు. కాకుమానులో మహిళలు పోలీసులకు స్వీట్లు తినిపించారు. ఎన్‌కౌంటర్‌పై విజయవాడలోని సిద్ధార్ధ కాలేజీల్లో విద్యార్థినులు బ్యాండు కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులను అభినందిస్తూ నినాదాలు చేశారు. బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.