కేయూలో సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల పడిగాపులు

కేయూలో సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల  పడిగాపులు

వరంగల్: కేయూ ఎగ్జామ్ బ్రాంచ్ దగ్గర సర్టిఫికెట్ల కోసం రోజూ పడిగాపులు కాస్తున్నారు విద్యార్థులు. చదువు పూర్తైనా సర్టిఫికెట్లు రాలేదంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోలేకపోతున్నామని తెలిపారు. దీంతో కాకాతీయ యూనివర్సిటీ పరిధిలో సర్టిఫికెట్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్. డిగ్రీ, పీజీ పూర్తై నెలలు గడుస్తున్నా వర్సిటీ అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ , ఖమ్మం,  ఆదిలాబాద్  జిల్లాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ చదవుతున్నారు. అయితే ఇప్పటికే చదువు పూర్తైనవాళ్లు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసి, కొన్ని నెలలుగా కేయూ ఎగ్జామ్ బ్రాంచి చుట్టూ తిరుగుతున్నారు. 

ఆన్ లైన్ లో తత్కాల్   సర్టిఫికెట్  కోసం 1.000 అదనంగా చెల్లించినా  నిర్ణీత గడువులోపు సర్టిఫికెట్లు అందడం లేదంటున్నారు కొందరు విద్యార్థులు. దూర ప్రాంతం నుంచి రావాలంటే చార్జీలకు ఇబ్బంది అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేయూ ఎగ్జామ్స్ బ్రాంచీలో ఎక్కువగా తాత్కాలికంగా పనిచేసే సిబ్బంది ఉన్నారు. వీళ్లకు  ఆన్ లైన్  పనుల పై సరైన అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పరీక్షల విభాగంలోని చాలామంది రిటైర్డు అయ్యారు. వాళ్ల స్థానంలో కొత్తవారిని నియమించక పోవటంతో సర్టిపికెట్ల జారీ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ రిజల్ట్ రాగానే మోమోలు కాలేజీలకు పంపిస్తామంటున్నారు కేయూ అసిస్టెంట్ రిజిస్టార్ శ్రీలత. భ్యాక్ ల్యాగ్ ఉన్న మోమోలే తమ దగ్గర  ఉన్నాయంటున్నారు. సర్టిపికెట్ల కోసం ఆన్ లైన్ లో పీజు చెల్లిస్తే....వెరిపికేషన్ చేయడానికి ఒకటి, రెండు రోజుల టైం పడుతుందని చెబుతున్నారు. సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగాలకు అప్లై చేసుకునే అవకాశం కల్పోతున్నామంటున్నారు విద్యార్థులు.