మెస్​ చార్జీలు పెంచాలని హాస్టల్ స్టూడెంట్స్​ ఆందోళన

మెస్​ చార్జీలు పెంచాలని హాస్టల్ స్టూడెంట్స్​ ఆందోళన

హైదరాబాద్, వెలుగు : పూటకు రూ.10 ఇస్తే  భోజనం ఎలా వస్తుందని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్​లోని బీసీ వెల్ఫేర్​ ఆఫీస్​ ముందు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. నిరసనకు సంఘం ప్రెసిడెంట్ ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపి మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రతినిధుల జీతాలు పెంచుకుంటరు.. ఉద్యోగులు జీతాలు పెంచుతరు.. కానీ, స్కాలర్ షిప్ లు, మెస్ చార్జీలు పెంచరా అని నిలదీశారు. ఐదేండ్లుగా మెస్ చార్జీలు పెంచడం లేదని, పెరిగిన ధరల ప్రకారం 8 లక్షల మంది యూనివర్సిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్, గురుకుల కాలేజీ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ, డిగ్రీ కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, సి.రాజేందర్, కృష్ణయాదవ్, అనంతయ్య, గజేందర్, తిరుపతి, నిఖిల్ పాల్గొన్నారు.