బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర ఉద్రిక్తత

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర ఉద్రిక్తత

 హైదరాబాద్ కూకటపల్లిలోని జేఎన్టీయూ యూనివర్సిటీ దగ్గర  ఉద్రిక్తత నెలకొంది.  యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర  విద్యార్థులు ధర్నాకు దిగారు. యూనివర్సిటీలో ఈఈఈ చదువుతున్న దివ్య అనే విద్యార్థిని మృతి చెందడంతో నిరసనకు దిగారు.  

వనస్థలిపురంలో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది బీటెక్ విద్యార్థిని దివ్య.  దీంతో నవంబర్ 28న జేఎన్టీయూ వర్సిటీ వ్యాప్తంగా బంద్ ప్రకటించాయి  విద్యార్థి సంఘాలు. ఈ క్రమంలో  ఏబీవీపీ, స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నారు విద్యార్థులు. అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందిందంటూ  విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ఈ సందర్బంగా యూనివర్శిటీ దగ్గరకు భారీగా చేరుకున్నారు పోలీసులు. విద్యార్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే విద్యార్థిని మృతికి కారణమైన జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. కాసేపు పోలీసులకు,విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది.