నీటి వసతి లేదని కేజీబీవి విద్యార్థుల ఆందోళన

నీటి వసతి లేదని కేజీబీవి విద్యార్థుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వినోభానగర్ లోని కేజీబీవీ విద్యార్థులు ధర్నాకు దిగారు. కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతూ నిరసన చేపట్టారు. హాస్టల్లో నీటి వసతి సరిగ్గా లేదని, ఫ్యాన్స్ కూడా లేవంటూ ఏడుస్తూ రోడ్డుపై బైటాయించారు. తమ హాస్టల్లో సమస్యలను వెంటనే తీర్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

రెండు రోజలు క్రితం వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించారు. ఈ ఘటనను ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా..వెంటనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సహా స్థానిక ఎమ్మెల్యేను ఆయన ఆదేశించారు.