విద్యార్థులు ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదగాలి: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

విద్యార్థులు ఉద్యోగాల సృష్టికర్తలుగా ఎదగాలి: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా

గచ్చిబౌలి, వెలుగు: విద్యార్థులు పరిశోధకులుగా, ఉద్యోగాల సృష్టికర్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని గవర్నర్​ శివ్​ప్రతాప్​ శుక్లా పిలుపునిచ్చారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం గురువారం అట్టహాసంగా జరిగింది. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్​ శాంతి సరోవర్​లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డీఆర్డీవో మాజీ చైర్మన్​ సమీర్​ వి.కామత్​తో కలిసి హాజరయ్యారు.

1,721 మందికి డిగ్రీ పట్టాలు, 300 మంది పిహెచ్​డీ పట్టాలు, 178 మంది స్టూడెంట్స్​కు మెడల్స్​ అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్​ మాట్లాడుతూ.. యువత కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖిరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ విజయాన్ని, జ్ఞానాన్ని సమాజ సేవకు ఉపయోగించాలని కోరారు. మాదరద్రవ్యాల బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్​సీయూ చాన్స్​లర్​ ఎల్. నర్సింహారెడ్డి, వీసీ​అనురాధ పాల్గొన్నారు.