
నిజామాబాద్, వెలుగు : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం నిజామాబాద్‌లోని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌గౌడ్ ఇంటి ముట్టడికి యత్నించారు. పీడీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గౌతంకుమార్, జన్నారపు రాజేశ్వర్ ఆధ్వర్యంలో ముట్టడికి యత్నించగా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఇంజినీరింగ్ వరకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, కొత్త జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయడంతో పాటు ప్రభుత్వ స్కూల్స్‌లో సౌలత్‌లు కల్పించాలని కోరారు. ముట్టడికి యత్నించిన వారిలో కార్తీక్, ప్రిన్స్, మేత్రి రాజశేఖర్, మనోజ్, సాయినాథ్, రాహుల్, శ్రీకాంత్, సాయికిరణ్, దుర్గాప్రసాద్ ఉన్నారు.