గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ విద్యార్థులు

వైజాగ్ : చదువుకునే వయసులో వ్యసనాలకు అలవాటుపడ్డ నలుగురు నలుగురు విద్యార్థులు..గంజాయి అమ్మడాన్నే మార్గంగా ఎంచుకున్నారు. కొన్ని రోజులుగా సీక్రెట్ గా గంజాయిని కాలేజీ విద్యార్ధులకు సరఫరా చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. ఇటీవల ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని ఇంట్లో అబద్దం చెప్పిన నలుగురు విద్యార్థులు గంజాయి కోసం వైజాగ్ వెళ్లారు. తిరిగి హైదరాబాద్ వస్తుండగా వైజాగ్ దగ్గర పోలీసుల కార్డెన్ సర్చ్ లో పట్టబడ్డారు.

వివరాలు: హైదరాబాద్  లోని బాచుపల్లి కి చెందిన నలుగురు విద్యార్థుల్లో ముగ్గురు ఇంజనీరింగ్ చదువుతున్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన వీరు.. ఆదివారం బాపట్లలో పెళ్లి ఉందని అబద్ధం చెప్పి తమ స్నేహితుడి  కారు తీసుకొని  వైజాగ్ వెళ్లారు. అరకు లోయకు వెళ్ళి కృష్ణ అనే  మధ్య వర్తి ద్వార  రెండున్నర కేజీలు గంజాయ్ తీసుకొని తిరిగి హైదరాబాద్ ప్రయాణమయ్యారు.  వీరికి దారి తెలియక సెల్ ఫోన్ లో GPS నమ్ముకొని ప్రయాణిస్తుండగా మధ్యలో GPS సిగ్నల్ కట్ అయ్యింది.

దీంతో దారి తప్పి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం వస్తున్నారు.  అదే సమయంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసి  యువకులు  కారు రివర్స్ తీసుకొని హడావిడిగా వెళ్ళే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వెంటనే యువకుల వాహనాన్ని వెంబడించి తనిఖీ చేశారు. కారులో ఉన్న  గంజాయిని స్వాధీనం చేసుకున్నా పోలీసులు.. విద్యార్థులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.