ప్రస్తుత ప్రపంచం అంతా కలుషితం.. గాలి కలుషితం, నీరు కలుషితం..ఆహారం కలుషితం.. ప్రతితీ కలుషితమే... చివరికి తల్లి పాలు కూడా కలుషితం అవుతున్నాయంటే మీరు నమ్ముతారా? అవును ఇది నిజం.. ఇటీవల జరిగిన అధ్యయనాల్లో తల్లి పాలు కలుషితం అయ్యాయని సంచలన విషయాలను బహిర్గతం చేస్తున్నాయి.
బిహార్ లో పాలిచ్చే తల్లుల తల్లిపాలల్లో యురేనియం ఉన్నట్లు ఇటీవల జరిగిన ఓ అధ్యయనంలో భయంకరమైన ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీనియర్ శాస్త్రవేత్త, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సభ్యుడు డాక్టర్ శర్మ నేతృత్వంలో జరిగిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయింది.
పాట్నాలోని మహావీర్ క్యాన్సర్ సంస్థాన్ ,పరిశోధనా కేంద్రం, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, న్యూఢిల్లీలోని AIIMS శాస్త్రవేత్తల బృందం బీహార్‌లో ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. బ్రిటిష్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్ లోని ఒక నివేదిక ప్రకారం..బీహార్ నుంచి వచ్చిన తల్లి పాల నమూనాలలో 5ppb (పార్ట్స్ పర్ బిలియన్) వరకు యురేనియం ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
40 మంది పాలిచ్చే తల్లుల తల్లిపాలను విశ్లేషించారు. అన్ని శాంపిల్స్ లో యురేనియం (U238) ఉన్నట్లు వెల్లడైంది. ఇది 70 మంది శిశువులు క్యాన్సర్ బారిన పడే ఆరోగ్య ప్రమాదం ఉందని తెలిపింది. అయితే మొత్తం యూరేనియం స్థాయిలు WHO అనుమతించిన లిమిట్స్ లో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే బీహార్ లో అధ్యయనం ఫలితాలు శిశువు ఆరోగ్యంపై ప్రభావం తక్కువగా ఉంటుందని ,మహిళలు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించాలని డాక్టర్ శర్మ అన్నారు.ఇదిలా ఇలాటే కొనసాగితే మాత్రం చాలా ప్రమాదకరం అన్నారు.
