హిందువులు.. పండుగలకు.. పుణ్య దినాలకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పురాణాల ప్రకారం జగన్మాత కుమారుడు కమారస్వామి.. సుబ్రమణ్యేశ్వరస్వామి ఆరాధనకు చాలా విశిష్టత ఉంది. ఆ స్వామిని ప్రతి నెలలో శుక్ల పక్షంలో షష్ఠి తిథి రోజున పూజిస్తే సంతాన వృద్ది కలగడమే కాకుండా.. జాతకంలో రాహు కేతువుల దోషము తొలగుతుందని పండితులు చెబుతున్నారు. మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు ప్రత్యేకతమైన విశిష్టత ఉందని పండితులు చెబుతారు.
మార్గశిరమాసం శుక్లపక్షం షష్ఠి ( నవంబర్ 26) సాయంత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి.. శివయ్యకు అభిషేకం చేస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు విశేషమైనది. ఈ ఈ రోజున శ్రీసుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహు కేతు దోషాలు, కాల సర్పదోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయని, ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
సుబ్రహ్మణ్య అష్టకం, శ్రీ షణ్ముఖ స్తోత్రాన్ని చదివితే కూడా మంచి జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. వీటిని చదవలేని వారు “ఓం శ్రీ శరవణ భవాయ నమః” అనే మంత్రాన్ని జపిస్తే సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేక అనుగ్రహం కలిగి.. సకల పాపాలు తొలగిపోతాయి.
- శివపార్వతులను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఎంతో మంచే జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
- శివలింగానికి నీటిని, పెరుగుని సమర్పించండి. డబ్బుకి లోటు ఉండదు. సంతోషము ఉంటుంది.
- శివలింగానికి తేనెను సమర్పిస్తే అదృష్టం కలిసి వస్తుంది. దురదృష్టం తొలగిపోయి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
- శివలింగానికి బిల్వపత్రాలను సమర్పిస్తే కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంపద పెరుగుతుంది,
- చెరుకు రసాన్ని శివలింగానికి సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది
- నల్ల నువ్వులను శివలింగానికి సమర్పిస్తే శని దోషాల నుంచి బయటపడవచ్చు. డబ్బు కొరత ఉండదు, అన్ని విధాలుగా కలిసి వస్తుంది, ఆనందంగా ఉండొచ్చు.
- కుజ దోషాలు ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే ఎంతో మంచి జరుగుతుంది. పెళ్లయిన వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తే వైవాహిక జీవితంలో ఉన్న బాధలు తొలగిపోతాయి. సర్ప దోషాలు తొలగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
