షాద్ నగర్, వెలుగు: హజరత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సును విజయవంతం చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. సోమవారం జహంగీర్ పీర్ దర్గాలో వక్ఫ్ బోర్డు కార్యనిర్వహణ అధికారి అబ్దుల్ సత్తార్, కొత్తూరు ఎస్ ఐ తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉర్సు సమయంలో భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.
ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కోరారు. మంచినీటి సౌకర్యం కల్పించాలని, విద్యుత్ దీపాల అలంకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
