అద్భుతం : 21 కేజీల గుమ్మడికాయ పండించిన రైతు

అద్భుతం : 21 కేజీల గుమ్మడికాయ పండించిన రైతు

గుమ్మడికాయ...దీనినే కాశీఫాల్ అని కూడా అంటారు. ఇది ఒక కూరగాయ. దీనిని  పండు, కూరగాయలుగా కూడా ఉపయోగిస్తారు. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండటం వల్ల భారతీయ వంటకాల్లో వంటకాలలో ఉపయోగిస్తుంటారు. స్వీట్లు తయారు చేస్తారు.గుమ్మడిలో అద్భుత ఔషద గుణాలు కూడా ఉంటాయి.వివిధ రోగాలను నయం చేసే గుణంఉంటంది. మలబద్దకం, మధుమేహం రోగాలకు వాడే మందుల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. 

అయితే ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ రైతు తన పొలంలో 21 కేజీల గుమ్మడి కాయను పండించారు. ఈ ప్రత్యేకమైన గుమ్మడి కాయలలో నారింజ , నలుపు, ఆకుపచ్చ ఇలా అనేక రంగులు ప్రత్యేకత. అంతేకాదు దాని ఆకారం గుండ్రంగా, పొడవులు ఇలా అనేక రకాలుగా ఉంటాయి. బరువు కూడా 18 నుంచి 21 కేజీల వరకు ఉంటుంది .అటువంటి గుమ్మడి కాయలను డంకల్ జాతుల విత్తనాలనుంచి పెంచుతామని  రైతు రామ్ ప్రీత్ మౌర్య చెపుతున్నారు. చెట్టుకు 5 నుంచి 6 గుమ్మడికాయలు వస్తాయని.. దాని పంట ను ఫిబ్రవరినెలలో నాటితే మే నెలలో కోతకు వస్తుందన్నారు. ఈ ప్రత్యేక గుమ్మడికాయ పండే వరకు చాలా జాగ్రత్తలు అవసరం . దీని సాగులో వర్మీ కంపోస్ట్ లేదా వానపాముల ఎరువును ఉపయోగిస్తారట. 

ఇటీవల లక్నోలోని రాజ్ భవన్ లో ప్రాంతీయ పండ్లు కూరగాయల , పూల ప్రదర్శనలో ఈ ప్రత్యేక మైన గుమ్మడికాయను ప్రదర్శనకు పెట్టారు. దీనిని చూడటానికి ప్రజలు చాలా మంది వస్తున్నారట. 

ఈ గుమ్మడి కాయను వర్షాకాలంలో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. దీని ధర రూ..200 నుంచి 30 0 వరకు ఉంటుంది. నరేంద్ర అభూషణ్ రకం గుమ్మడికాయ మీడియం సైజులో గుండ్రంగా ఉంటుంది. దానిపై ముదురు ఆకుపచ్చ మచ్చలుఉంటాయి. ఈ రకం పండు పండిన తర్వాత  నారింజ రంగులోకి మారుతుంది. హెక్టారుకు 400 క్వింటాళ్ల వరకు దిగుబడి  వస్తుందట. 

గుమ్మడి పంటను ఏడాదికి రెండు సార్లు సాగు చేస్తారు. మొదటి పంటను ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య, రెండో పంటను జూన్ నుంచి ఆగస్టు మధ్య సాగు చేస్తారు. సీజన్ ను బట్టి వివిధ రకాలను సాగు చేస్తారు. గోరక్ పూర్ కు చెందిన రాంప్రీత్ మౌర్య తన పది ఎకరాల్లో గుమ్మడికాయను సాగు చేస్తూ.. సంవత్సరాని 7-8 లక్షలు సంపాదిస్తున్నారు.