తీర్థంతో పాటు.. కృష్ణుడి విగ్రహాన్ని మింగాడు

తీర్థంతో పాటు.. కృష్ణుడి విగ్రహాన్ని మింగాడు

అనుకోకుండా కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. అవి ప్రాణాల మీదకు వస్తాయి. తెలియకుండా కొన్ని వస్తువులను మింగేస్తుంటారు కొందరు. దీంతో వారిని రక్షించేందుకు డాక్టర్లు శ్రమిస్తారు. ఓ వ్యక్తి తీర్థంతో పాటు శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని మింగాడు. గొంతులో అడ్డంగా ఇరికిపోవడంతో అతను శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స చేసి విగ్రహాన్ని బయటకు తీశారు. ప్రస్తుతం అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. రోగిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీనికి సంబంధించిన ఎక్స్ రే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

గొంతు కింది భాగంలో ఆ విగ్రహం ఇరికిపోయినట్లుగా కనిపిస్తోంది. ఆపరేషన్ అనంతరం ఆ విగ్రహాన్ని సంబంధించిన ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. కర్నాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత సంవత్సరం యూకేలో మనిషి అయస్కాంతంగా మారాలని అయస్కాంతాలను ఓ 12 ఏళ్ల బాలుడు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మొత్తం 54 అయస్కాంతాలను అతను మింగాడు. అతడిని బతికించడానికి దాదాపు వైద్యులు 6 గంటల పాటు ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది.