
న్యూఢిల్లీ: హైవేలపై సడెన్‌గా బ్రేక్ వేయడం ముమ్మాటికీ నిర్లక్ష్యంగానే పరిగణించాలని, దానికి డ్రైవర్లను బాధ్యులుగా చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఎలాంటి ఇండికేటర్లేకుండా వాహనదారులు సడెన్బ్రేక్వేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2017 జనవరి 7న తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఇంజనీరింగ్స్టూడెంట్మహ్మద్హకీమ్ దాఖలుచేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు ధూలియా, జస్టిస్అరవింద్ కుమార్‌తో కూడిన బెంచ్ విచారించింది. తాను బైక్‌తో రోడ్డుపై వెళ్తుండగా.. ముందున్న కారు డ్రైవర్ సడెన్‌గా బ్రేక్ వేశాడని, దాంతో తాను అదుపుతప్పి పడిపోయానని హకీమ్ చెప్పాడు.
అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బస్సు తనను ఢీకొందని చెప్పాడు. కారు డ్రైవర్సడెన్గా బ్రేక్‌వేయడం వల్లే తాను కాలు కోల్పోవాల్సి వచ్చిందని, తనకు న్యాయం చేయాలని అభ్యర్థించాడు. అయితే.. గర్భిణి అయిన తన భార్య కారులో వాంతులు చేసుకోవడంతో సడెన్‌గా బ్రేక్ వేయాల్సి వచ్చిందని డ్రైవర్తెలిపాడు. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్స్పందిస్తూ.. ‘‘హైవేలపై వెహికల్స్ స్పీడ్‌గా వెళ్తుంటాయి. ముందువెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే.. వెనక వచ్చే వారికి ప్రమాదమే కదా?! సడెన్ బ్రేక్‌వేయడం ముమ్మాటికీ నిర్లక్ష్యమే. హకీమ్‌కు పరిహారం ఇవ్వాల్సిందే” అని ఇన్సూరెన్స్ కంపెనీలకు కోర్టు స్పష్టం చేసింది.