సూపర్ పవర్స్‌‌‌‌‌‌‌‌తో సుధీర్ బాబు జటాధర

సూపర్ పవర్స్‌‌‌‌‌‌‌‌తో  సుధీర్ బాబు  జటాధర

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా జంటగా రూపొందుతున్న  మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘జటాధర’.  వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు.  జీ స్టూడియోస్ సమర్పణలో ఉమేష్‌‌‌‌‌‌‌‌ కె భన్సాల్‌‌‌‌‌‌‌‌, ప్రేరణ అరోరా నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు మేకర్స్‌‌‌‌‌‌‌‌. ఆగస్టు 8న టీజర్ విడుదల చేయబోతున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్స్‌‌‌‌‌‌‌‌ విడుదల చేశారు.  మానవాళి వర్సెస్‌‌‌‌‌‌‌‌ దైవత్వం, శాపం వర్సెస్‌‌‌‌‌‌‌‌ శక్తి మధ్య సంగ్రామం అనే కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌తో డిజైన్ చేసిన పోస్టర్స్‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకున్నాయి. భారతీయ పురాణాల్ని గ్రాఫిక్స్‌‌‌‌‌‌‌‌తో బ్లెండ్ చేస్తూ, విజువల్ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.