ఓ ఆర్టీసీ కార్మికుడి ఆవేదన

ఓ ఆర్టీసీ కార్మికుడి ఆవేదన

ఆర్టీసీ సమ్మె మొదలై నెల రోజులు కావొస్తోంది.  దసరా, దీపావళి పండగలు కూడా జరుపుకోలేదు.  పండగ పూట పస్తులే దిక్కయ్యాయి. చేసిన పనికి కూడా జీతం ఇవ్వలేదు ఆర్టీసీ యాజమాన్యం. జీతం ఇవ్వమంటే డబ్బుల్లేవంటోంది. చేతిలో చిల్లగవ్వ లేక నానాకష్టాలు పడుతున్నారు ఆర్టీసీ కార్మికులు.

ఓ కార్మికుడు తన ఫ్రెండ్ తో చెప్పుకుంటున్న కష్టాలు… అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆ కార్మికుడు ఆవేదనతో ఇంకా ఏం చెప్పాడంటే…

మన కుటుంబాలన్నీ ఇక రోడ్డుమీద పడ్డట్టేనంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతమంది  కార్మికులు చనిపోతున్నాప్రభుత్వంలో కొంచెం కూడా చలనం కన్పించడం లేదు. కరీంనగర్లో శవాన్ని పెట్టుకొని అందరూ ఆందోళన చేసినా సీఎం కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని…ఆత్మహత్యలు చేసుకోకండి, ధైర్యంగా ఉండండని ఒక్క మాట చెబితే ఆత్మహత్యలు ఎవరూ చేసుకోరు కదా. మీకు ఏదైన చేస్తా.. ప్రస్తుతం బడ్జెట్ లేదు.. తొందరపడొద్దు అని చెబితే బాగుండేది.  పే స్కేల్ ఇస్తా..ఇరవయ్యో,ముప్పైయ్యో ఇస్తా పని చూసుకోండి.. ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చుకోండని ఎండీని ఆదేశించాలే కాని ఇలా చేయడం ఎంత వరకు న్యాయం అన్నా. ఆరువేల కిరాయి కట్టాలే..పోయిన నెల, ఈనెల కిరాయి కట్టలే. తిన్నది తక్కువ..ఉపాసం ఉన్నది ఎక్కువ. కిరాయి మాత్రం 12వేలు అయ్యింది. ఈ నెల కిరాయి కట్టకపోతే ఇళ్లు కాళీ చేయాల్సిందే.  ఎంత మందికి జీతాలియ్యకుండా ఉంటాడు. ఇంటికెళ్తే  డాడీ నాకేం తెచ్చావని నా బిడ్డ అడిగితే.. ఏం తేలేదని ఎలా చెప్పాలో తెలియక కుమిలిపోతున్నా. భార్యమో కొబ్బరికాయ కొట్టిన..దాన్ని పచ్చడి చేసినా..ఆ పచ్చడి తిను అంటోంది…అలాంటి బతుకాయే.. ఏందన్నా ఇది.

ఇది ఈ ఒక్క కార్మికుడి ఆవేదనే కాదు. సగటు కార్మికుడి ఆవేదన అని చెప్పుకుంటున్నారు.