హే భగవాన్ కంప్లీట్ ఎంటర్‌‌‌‌టైనర్

హే భగవాన్ కంప్లీట్ ఎంటర్‌‌‌‌టైనర్

సుహాస్ హీరోగా గోపి అచ్చర దర్శకత్వంలో బి నరేంద్ర రెడ్డి నిర్మించిన  చిత్రం  ‘హే భగవాన్’. ఫిబ్రవరి 20న సినిమా విడుదల కానుంది.  బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. గురువారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్ ఈ చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచేలా ఉంటుందని చెబుతూ టీమ్‌‌కు బెస్ట్  విషెస్ చెప్పాడు. ఇదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌టైనర్ అని, కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి అన్నారు.

ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌‌తో సాగే ఈ చిత్రం సరికొత్తగా ఉంటుందని సుహాస్ చెప్పాడు. కామెడీ, లవ్, ఎమోషన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న  ఉగాది పచ్చడిలాంటి సినిమా ఇదని హీరోయిన్ శివాని నాగారం చెప్పింది. ఈ చిత్రం ఆడియెన్స్‌‌కు కచ్చితంగా అలరిస్తుందని దర్శకుడు గోపి అన్నాడు.  నిర్మాత బి. నరేంద్ర రెడ్డి, నటులు వీకే నరేష్,  సుదర్శన్,  స్రవంతి చొక్కారపు సహా టీమ్ అంతా పాల్గొన్నారు.