ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. ఢిల్లీ బ్లాస్ట్ నిందితుడు డా.ఉమర్ చివరి వీడియో

ఆత్మాహుతి దాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. ఢిల్లీ బ్లాస్ట్  నిందితుడు డా.ఉమర్ చివరి వీడియో

దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున, ఎర్రకోట దగ్గర కార్ బాండ్ బ్లాస్ట్ చేసి 15 మంది మృతికి కారకుడైన డా.ఉమర్ ఉన్ నబీ.. బ్లాస్ట్ కు ముందు రికార్డ్ చేసిన చివరి వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఆత్మాహుతి దాడి గురించి సమర్థించుకునేలా రికార్డు చేశాడు ఈ ఉగ్రవాది. సూసైడ్ బాంబ్ గురించి ప్రేరేపించేలా ఉన్న అతని వీడియోలో ఉన్న ముఖ్యాంశాలు ఇవి.

ఆత్మాహుతి దాడి చేసుకోవాలనుకునే వాడు భయంకరమైన మైండ్ సెట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. చావే అంతిమ లక్ష్యం అని నిర్ణయించుకోవాలి. నిజానికి అలాంటి ఆలోచనను ఈ సమాజం ఒప్పుకోదు.. అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. 

ఆత్మాహుతి దాడిని సమర్థించుకునే విధంగా వీడియో రికార్డు చేశాడు డా.ఉమర్. ఆత్మాహుతి దాడి అంటే.. నిజీనికి ఇది అమరులయ్యే ఆపరేషన్.. ఇస్లాంలోనూ దీనికి చోటుంది.. కానీ సమాజం దీనికి ఒప్పుకోదు. ప్రపంచం ఆత్మాహుతి దాడిని తప్పుగా  అర్థం చేసుకుంటుంది. ఆత్మాహుతి దాడిపై సమాజంలో పలు రకాల వాదనలు ఉన్నాయి. ఆత్మాహుతి దాడి ప్రజాస్వామ్యం కాదు.. నాగరిక సమాజం కూడా దీన్ని అంగీకరించదు.. అంటూ-సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఆత్మాహుతి దాడి అంటే అమరులయ్యే మార్గం అంటూ ఉగ్ర చర్యలను సమర్థించుకుంటూనే.. మోటివేట్ చేసేలా వీడియో రికార్డ్ చేశాడు. 

2025,  నవంబర్ 11న భారీ పేలుడుతో దేశరాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకి అప్పగించింది. ఈ కేసును సీరియస్‎గా తీసుకున్న ఏన్ఐఏ విచారణ వేగవంతం చేసింది.