
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. MAA అధ్యక్షుడి పదవి కోసం ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు, నటి జీవిత రాజశేఖర్, నటి హేమ, సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు మొత్తం ఐదుగురు పోటీలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్ష పదవి కోసం బరిలో నిలబడుతున్న నటుడు ప్రకాష్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ కొందరు వ్యాఖ్యానించండం పెద్ద దుమారాన్ని రేపుతోంది. దీనిపై స్పందించిన సీనియర్ నటుడు సుమన్.. పరోక్షంగా ప్రకాశ్ రాజ్ కు మద్దతును ప్రకటించారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ లోకలేనని చెప్పారు. డాక్టర్లు, రైతులు కూడా నాన్ లోకల్ అనుకుంటే జనాలకు వైద్య చికిత్స, ఆహారం కూడా అందదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ అమీర్ పేటలోని అస్టర్ ప్రైమ్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో డాక్టర్లు చేసిన సేవలు చాలా గొప్పవన్నారు. ఈ సందర్భంగానే మా ఎన్నికల గురించి ఆయన స్పందించారు. అందరూ కలసికట్టుగా ఉండాలని… లోకల్, నాన్ లోకల్ అనే భావన వద్దని తెలిపారు.ని సూచించారు.