సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఆటకు దూరమైన విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. బల్దియా ఆధ్వర్యంలో ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నారు. 800 మంది కోచ్ లతో శిక్షణ ఇవ్వనున్నారు. 44 క్రీడల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తామని అధికారులు తెలిపారు. స్పోర్ట్స్ మెటీరియల్ కోసం  రూ.1.20 కోట్లను జీహెచ్ఎంసీ కేటాయించింది. ఈ క్యాంప్ లో పాల్గొనేందుకు ఆరేండ్ల నుంచి 16 ఏండ్ల వయసుగల విద్యార్థులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమన్నారు మేయర్.. ట్రైనర్స్ కి కూడా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. గత ఏడాది వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు మేయర్.

ఒడియా రచయిత్రి బినాపాని ఇక లేరు 

ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో  మెక్రాన్ ఘన విజయం