Summer Holidays:  వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Summer Holidays:  వేసవి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, దాన్ని మార్చుతూ ఏప్రిల్ 12 నుంచి ప్రారంభిచాలని జీవో జారీ చేసింది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే 48 రోజులు పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. మరోవైపు ఎండలు పెరిగిపోతున్న దృష్ట్యా మార్చి రెండో వారం నుంచి ఒంటి పూట బడులు నడపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహిస్తారు.