ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్

ఏప్రిల్ 25 నుంచి స్కూళ్లకు సమ్మర్ హాలిడేస్

సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.  ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఈ అకడమిక్​ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 24. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలిడేస్ కొనసాగనున్నాయి.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ క్లాసులు కొనసాగనున్నాయి. 2022–23 అకడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 24  వరకూ అన్ని స్కూళ్లు ఇదే టైమ్​ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుంది. అయితే, టెన్త్ క్లాసు స్టూడెంట్ల విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఇస్తున్నారు. పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో వారికి స్పెషల్ క్లాసులు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ సమ్మర్ హాలిడేస్ కొనసాగనున్నాయి. అకడమిక్ ఇయర్ గైడ్​లైన్స్​ ప్రకారమే ముందుకు పోతున్నామని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెప్తున్నారు. కాగా, ఏప్రిల్10 నుంచి 17 వరకూ ఒకటో తరగతి నుంచి 9వ తరగతి స్టూడెంట్లకు  సమ్మెటివ్ అసెస్ మెంట్–2  (వార్షిక) పరీక్షలు ఉంటాయి.