సూర్య రశ్మి నీళ్లు.. ఇలా తయారు చేసుకుని తాగండి.. విటమిన్ D పుష్కలం

సూర్య రశ్మి నీళ్లు.. ఇలా తయారు చేసుకుని తాగండి.. విటమిన్ D పుష్కలం

Sun Charged Water: సూర్య రశ్మి వల్ల విటమిన్- D దొరుకుతుందని సన్ బాత్ చేస్తుంటారు. అదొక్కటే కాదు, సూర్యరశ్మిలో ఉంచిన నీళ్లు యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గా పని చేస్తాయట. వీటిని సన్ ఛార్జ్ వాటర్ అంటారు. ఆ నీళ్లు తాగితే అనారోగ్య, చర్మ సమస్యలు దూరమవుతాయి. ఈ ప్రాసెస్ ను ఆయుర్వేదంలో 'సూర్య జల్ చికిత్స' అంటారు.

* సన్ ఛార్జ్ వాటర్ తాగితే రోజులో కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. దద్దుర్లు, ఎలర్జీ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. డ్యామేజ్ అయిన చర్మ కణాలు రిపేర్ అవుతాయి. దాంతో చర్మం తిరిగి ప్రకాశవంతంగా మారుతుంది.

* ఈ నీళ్లలోని యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కంటి సమస్యను దూరం చేస్తాయి. కండ్లకలక, కనుగుడ్డు నొప్పి ఉన్నవాళ్లు ఈ నీళ్లతో మొహం కడుక్కోవడం వల్ల కొంత ఉపశమనం దొరుకుతుంది. 

* సన్ ఛార్జ్ వాటర్ గుండెలో మంటలు, అల్సర్లను పోగొడతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

సన్ ఛార్జ్ (సూర్య రశ్మి) నీళ్లను ఎలా తయారు చేయాలంటే: 
రాగి లేదా గాజు లేదా ఏదైనా మెటల్ పాత్రలో నీళ్లు తీసుకోవాలి.. ఆ నీళ్లను సుమారు 8 గంటల పాటు ఎండలో ఉంచి.. ఆ తర్వాత తాగాలి. ఎండలో ఉంచిన నీళ్లను ఫ్రిజ్ లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. అలా చేస్తే నీళ్లు వచ్చిన హెల్త్ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. అంతేకాదు.. నీళ్లు ప్లాస్టిక్ గిన్నెలో పోసి ఎండకు అస్సలు పెట్టరాదు.. ఎండకు ప్లాస్టిక్ కరిగి నీళ్లలో కలిసే అవకాశం ఉంటుంది. అది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.