కొత్తదనం, కామెడీతో కనెక్ట్ అయ్యేలా ‘సుందరకాండ’

కొత్తదనం, కామెడీతో కనెక్ట్ అయ్యేలా ‘సుందరకాండ’

నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన చిత్రం ‘సుందరకాండ’. ఆగస్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నారా రోహిత్ చెప్పిన విశేషాలు. ‘‘డైరెక్టర్ వెంకటేష్ ఈ ఐడియా చెప్పినప్పుడు కంగారుపడ్డాను.  ఆడియెన్స్ ఎలా తీసుకుంటారో అనిపించింది.  అయితే అదే సమయంలో వచ్చిన  ‘బ్రో డాడీ’  సినిమా ఒక విండో ఓపెన్ చేసింది. ఆ స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేస్తే వర్కవుట్  అవుతుందనిపించింది. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఆడియెన్స్ ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒక స్మైల్ ఉంటుంది. ఈ జనరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఇది చాలా కొత్త కథ. నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కొత్తదనం ఉంటూనే అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.

30 ఏళ్లు  దాటినా కూడా కావలసిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతకడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఆ కాంప్లికేషన్ నుంచే ఫన్ క్రియేట్ అవుతుంది. నరేష్ గారు, సత్య పాత్రల నుంచి వచ్చే కామెడీ చాలా ఫ్రెష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది.  వెంకటేష్​  చాలా సెన్సిబుల్ డైరెక్టర్. తను అనుకున్న కథను అద్భుతంగా స్ర్కీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైకి తీసుకొచ్చాడు.  ఈ సినిమా నా ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  స్టార్ట్ చేశాను.  సంతోష్ నా కజిన్. తను ఎప్పటి నుంచో  ఒక మంచి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు. గౌతమ్,  రాకేష్.. వెంకీ చెప్పిన కథ నచ్చి జాయిన్ అయ్యారు. వెంకటేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే మరో సినిమా చేయాలనుకుంటున్నా’’.