క్లీన్‌‌‌‌‌‌‌‌ కామెడీతో.. నవ్వించే క్యూట్‌‌‌‌‌‌‌‌ లవ్ స్టోరీ

క్లీన్‌‌‌‌‌‌‌‌ కామెడీతో.. నవ్వించే క్యూట్‌‌‌‌‌‌‌‌ లవ్ స్టోరీ

నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో  సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించిన చిత్రం ‘సుందరకాండ’. ఆగస్టు 27న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకటేష్ మాట్లాడుతూ ‘నాకు ఫ్యామిలీ కథలంటే ఇష్టం. ‘కలిసుందాం రా’ నా ఫేవరెట్ సినిమా. అందుకే నా మొదటి మూవీనే క్యూట్ ఫ్యామిలీ స్టోరీ చేయాలనుకున్నా. 

నారా రోహిత్‌‌‌‌‌‌‌‌తో ఎనిమిదేళ్ల  జర్నీ ఉంది. ఆయనకు కథ చెప్పగానే ఇంప్రెస్ అయ్యారు.  30 సంవత్సరాలు  దాటాక పెళ్లి కాకపోవడమే పెద్ద పంచాయతీ అనుకుంటే, కాబోయే వైఫ్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేకమైన క్వాలిటీలు వెతుక్కునే  పర్సన్ ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది కథ.  రెండు డిఫరెంట్ ఏజ్ గ్రూపులున్న లవ్ స్టోరీ.  రోహిత్ కంటే ఏజ్డ్‌‌‌‌‌‌‌‌గా  కనిపించే అమ్మాయి కోసం వెతుకుతున్నప్పుడు శ్రీదేవి విజయ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అనుకున్నాం. 

ఆమె కూడా కథ విని ఒప్పుకున్నారు. ఈ సినిమా కోసం ఆవిడ చాలా ఎఫెర్ట్ పెట్టారు. స్కూల్ అమ్మాయిగా కనిపించడానికి డైట్ కూడా చేశారు. మరో హీరోయిన్ వృతి వాఘాని స్క్రీన్ ప్రెజెన్స్ బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఇక ఇందులో నటించిన నరేష్,  సునైనా, వాసుకి, సత్య  పాత్రలు కూడా చాలా బాగుంటాయి. ఇందులో ప్రతి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ ఫన్ ఉంటుంది. సినిమా చూస్తున్నపుడు ఆడియెన్స్ హాయిగా నవ్వుతూనే ఉంటారు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే క్లీన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అని చెప్పాడు.